logo

ప్రేమ పేరుతో మోసం చేసిన యువతిపై కేసు

ప్రేమ పేరుతో డబ్బులు దండుకుని మోసం చేసిందని ఓ యువతిపై ఎల్‌ఎండీ ఠాణాలో కేసు నమోదైంది. పోలీసులు, బాధితుడి తండ్రి వివరాల ప్రకారం..

Updated : 19 May 2024 04:20 IST

తిమ్మాపూర్, న్యూస్‌టుడే : ప్రేమ పేరుతో డబ్బులు దండుకుని మోసం చేసిందని ఓ యువతిపై ఎల్‌ఎండీ ఠాణాలో కేసు నమోదైంది. పోలీసులు, బాధితుడి తండ్రి వివరాల ప్రకారం.. తిమ్మాపూర్‌ మండల కేంద్రానికి చెందిన యువకుడు మాదన నాగరాజు యోగా శిక్షణ నిమిత్తం తమిళనాడులోని కోయంబత్తూరుకు వెళ్లిన సమయంలో అక్కడ విశాఖపట్నంకు చెందిన యువతిని ప్రేమించాడు. కొన్ని రోజులకు ఆమె ఆస్ట్రేలియా వెళ్లగా డబ్బులు కావాలని అనడంతో నాగరాజు రూ.లక్ష పంపాడు. అనంతరం ఆమె తిమ్మాపూర్‌లోని నాగరాజు ఇంటికి రాగా కుటుంబ సభ్యులు నిరాకరించడంతో గ్రామంలోని ఓ ఇంట్లో కొన్ని రోజులు ఇద్దరు అద్దెకు ఉన్నారు. తిరిగి ఆమె ఆస్ట్రేలియా వెళ్లింది. నాగరాజు కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తన భాగస్వామ్యాన్ని రద్దు చేసుకోగా వచ్చిన రూ.16 లక్షలు అక్కడి నుంచే యువతి తన బంధువుల ఖాతాలోకి బదిలీ చేయించుకుంది. అంతే కాకుండా తండ్రి నుంచి రావాల్సిన భూమిని పట్టా చేయించుకోవాలని నాగరాజుకు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించింది. దీంతో భూమి కోసం నాగరాజు కుటుంబ సభ్యులను వేధించాడు. అనంతరం మోసపోయానని గుర్తించి ఫినాయిల్‌ తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు యువతిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని