logo

జేఎన్టీయూ నాచుపల్లి కళాశాలకు ఐఎస్‌వో గుర్తింపు

కొడిమ్యాల మండలంలోని జేఎన్టీయూ నాచుపల్లి కళాశాల ఐఎస్‌వో గుర్తింపు పొందినట్లు ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కామాక్షి ప్రసాద్‌ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ సర్టిఫికేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ వారు ఈనెల 15న జేఎన్టీయూ నాచుపల్లి కళాశాలను సందర్శించి సర్టిఫికేషన్‌ కోసం అవసరమైన రికార్డులను పరిశీలించారు.

Updated : 19 May 2024 04:18 IST

గుర్తింపు పత్రం అందజేస్తున్న సంస్థ సభ్యులు 

కొడిమ్యాల, న్యూస్‌టుడే: కొడిమ్యాల మండలంలోని జేఎన్టీయూ నాచుపల్లి కళాశాల ఐఎస్‌వో గుర్తింపు పొందినట్లు ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కామాక్షి ప్రసాద్‌ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ సర్టిఫికేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ వారు ఈనెల 15న జేఎన్టీయూ నాచుపల్లి కళాశాలను సందర్శించి సర్టిఫికేషన్‌ కోసం అవసరమైన రికార్డులను పరిశీలించారు. అనంతరం శనివారం జేఎన్టీయూ హైదరాబాద్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వర్‌రావు సమక్షంలో సంస్థ సభ్యులు ప్రిన్సిపల్‌ కామాక్షి ప్రసాద్‌కు ఐఎస్‌వో(ఫర్‌ ఎడ్యుకేషనల్‌ ఆర్గనైజేషన్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌), (ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌), (ఫర్‌ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌) మూడు రకాల గుర్తింపు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ గుర్తింపు 2027 వరకు వర్తిస్తుందని తెలిపారు. అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ జి.దామోదర్‌రెడ్డి, కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ టి.వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని