logo

ముగ్గురు ఉపాధ్యాయుల సస్పెన్షన్‌

చిగురుమామిడి మండలం నవాబుపేట, సైదాపూర్‌ మండలంలోని తండా ప్రాథమిక పాఠశాలల్లో ఇతరులు నివసిస్తున్న విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ పాఠశాలల్లోని ఎస్జీటీలు ఎ.మంగ, బి.సునీతను సస్పెండ్‌ చేసినట్లు డీఈవో జనార్దన్‌రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 19 May 2024 03:43 IST

కరీంనగర్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: చిగురుమామిడి మండలం నవాబుపేట, సైదాపూర్‌ మండలంలోని తండా ప్రాథమిక పాఠశాలల్లో ఇతరులు నివసిస్తున్న విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ పాఠశాలల్లోని ఎస్జీటీలు ఎ.మంగ, బి.సునీతను సస్పెండ్‌ చేసినట్లు డీఈవో జనార్దన్‌రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రెండు మండలాల ఎంఈవోలకు షోకాజు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. కరీంనగర్‌లోని ఫకీర్‌నగర్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్జీటీగా పని చేస్తున్న ఎన్‌.మంజుల చాలా రోజులుగా గైర్హాజరు కావడంతో సస్పెండ్‌ చేసినట్లు పేర్కొన్నారు. ఈ పాఠశాల కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయుడు, కరీంనగర్‌ ఎంఈవోలను దీనిపై వివరణ కోరినట్లు చెప్పారు.

గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివించాలి

కరీంనగర్‌ విద్యావిభాగం : ప్రభుత్వ పాఠశాలలతోపాటు గుర్తింపు పొందిన జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో మాత్రమే తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించాలని డీఈవో జనార్దన్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. గుర్తింపు లేని పాఠశాలల్లో చదివిస్తే ఏమైనా సమస్యలు తలెత్తితే జిల్లా విద్యా శాఖ బాధ్యత వహించదన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని