logo

తప్పుడు దస్తావేజుతో భూమి అమ్మిన ఇద్దరి రిమాండ్‌

తప్పుడు దస్తావేజుతో భూమి అమ్మిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Published : 21 May 2024 02:40 IST

చొప్పదండి, న్యూస్‌టుడే : తప్పుడు దస్తావేజుతో భూమి అమ్మిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై ఉపేంద్రచారి తెలిపిన ప్రకారం... చొప్పదండికి చెందిన గుర్రం రాంరెడ్డి అనే వ్యక్తి చొప్పదండిలోని 65 గుంటల భూమిని 2010లో ముసిపట్ల దేవేందర్‌రెడ్డి, అన్నాడి శ్రీకాంత్‌రెడ్డిలకు విక్రయించి రిజిస్ట్రేషన్‌ చేశారు. 65 గుంటల్లో నుంచి ముసిపట్ల దేవేందర్‌రెడ్డి తన వాటాగా వచ్చిన భూమిని చొప్పదండికి చెందిన కొత్తూరు అంజయ్య, సుద్దాల వెంకటస్వామి అనే వ్యక్తులకు 2019లో విక్రయించారు. అనంతరం వారిద్దరు కలిసి ఎలిగేడుకు చెందిన చిలుక బాలమణికి ఆరు గుంటలు, మిగతా 26 గుంటలు కల్లెం అంజిరెడ్డి అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్‌ చేశారు. ఆ తర్వాత అదే దస్తావేజుతో కరీంనగర్‌కు చెందిన వైద్యుల మహేందర్‌రెడ్డి వద్ద రూ.8 లక్షలు తీసుకుని మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేశారు. అమ్మిన భూమిని చూపించమని అడిగితే తప్పించుకు తిరుగుతుండడంతోపాటు బెదిరింపులకు పాల్పడేవారు. మహేందర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు అంజయ్య, వెంకటస్వామిలపై కేసు నమోదుతోపాటు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని