logo

ఆన్‌లైన్‌లో మోసం.. డబ్బులు మాయం

ఆన్‌లైన్‌ మోసాలను అరికట్టడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నా మోసగాళ్లు కొత్త పుంతలతో ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు.

Published : 21 May 2024 02:43 IST

బ్యాంక్‌ వద్ద బాధితులు

గంభీరావుపేట, న్యూస్‌టుడే: ఆన్‌లైన్‌ మోసాలను అరికట్టడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నా మోసగాళ్లు కొత్త పుంతలతో ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన నలుగురు రైతుల వద్ద నుంచి ఏకంగా రూ.3,25,400 కాజేశారు. బాధితుల కథనం ప్రకారం.. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన యూనియన్‌ బ్యాంక్‌ ఖాతాదారులైన ఎంపీటీసీ సభ్యుడు కోటయ్యగారి రాజేందర్‌రెడ్డి ఖాతా నుంచి ఈ నెల 15 రూ.45,500 కట్‌ అయ్యాయి. 16న దండు నరేశ్‌ ఖాతా నుంచి రూ.44,900, 17న లింగారెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఖాతా నుంచి రూ.50 వేలు, 18న కోటయ్యగారి లత ఖాతా నుంచి రూ.1.85 లక్షలు కట్‌ అయ్యాయి. తమకు తెలియకుండానే డబ్బులు పోయాయని బాధితులు బ్యాంకు వద్దకు వచ్చారు. సైబర్‌ నేరగాళ్ల మాయగా నిర్ధారించుకొని నలుగురు బాధితులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు