logo

పక్కా ప్రణాళికతో పనులు పూర్తి చేయండి

అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మరమ్మతు పనులు పక్కా ప్రణాళికతో పూర్తి చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశించారు.

Published : 21 May 2024 02:45 IST

సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల కలెక్టరేట్, న్యూస్‌టుడే: అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మరమ్మతు పనులు పక్కా ప్రణాళికతో పూర్తి చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని ఈఈలు, ఎంపీడీవోలు, ఏఈలతో సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో నీటి సరఫరా, విద్యుత్తు పరికరాల ఏర్పాటు, మరుగుదొడ్లు, ఇతర మరమ్మతు పనులను ఎన్ని పాఠశాలల్లో మొదలు పెట్టారో తెలుసుకున్నారు. నాణ్యతతో పనులు చేయించాలని, ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనులు గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ పూజారి గౌతమి, జడ్పీ సీఈవో ఉమారాణి, డీఈవో రమేశ్‌కుమార్, టీఎస్‌ఈడబ్ల్యూ ఐడీసీ ఈఈ అనిత సింగనాథ్, డీపీవో వీరబుచ్చయ్య, సిరిసిల్ల, వేములవాడ కమిషనర్‌లు లావణ్య, అన్వేశ్, ఇరిగేషన్‌ ఈఈ అమరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌లో ప్రవేశాలు   

సిరిసిల్ల కలెక్టరేట్‌: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ జిల్లాలో 2024-25 విద్యాసంవత్సరానికి బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌లో ప్రవేశాలకు గిరిజన కుటుంబాలకు చెందిన విద్యార్థుల నుంచి 3, 5, 8వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని విద్యార్థుల కోసం 5 సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. 3వ తరగతిలో లంబాడీ బాలికలకు 1, బాలురకు 1, ఎరుకల బాలురకు 1 సీటు.. 5వ తరగతిలో లంబాడీ బాలురకు 1, 8వ తరగతిలో లంబాడీ బాలికలకు 1 సీటు కేటాయించారన్నారు. అభ్యర్థులు జిల్లాకు చెందిన వారై ఉండాలని, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం అర్బన్‌ ఏరియాలో రూ.2 లక్షలు, రూరల్‌ ఏరియాలో రూ.1.50 లక్షలు ఉండి, షెడ్యూల్డ్‌ తెగల కుటుంబాలకు చెందిన వారై ఉండాలన్నారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్‌ 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కరీంనగర్‌లోని జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ కార్యాలయంలో అందించాలని సూచించారు. జూన్‌ 12న లాటరీ ద్వారా ఎంపిక జరుగుతుందని, ఒక కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే అర్హత ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 96521 18867 నంబరును సంప్రదించాలని సూచించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని