logo

‘పెద్దపల్లిలో భాజపాదే గెలుపు’

ప్రజల్లో జాతీయవాదం పెరగడంతోనే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు అధిక ఓట్లు పడ్డాయని, ప్రజల సంపూర్ణ మద్దతుతో లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించనున్నట్లు ఆ పార్టీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస ధీమా వ్యక్తం చేశారు.

Published : 21 May 2024 02:49 IST

మాట్లాడుతున్న గోమాసె శ్రీనివాస్‌

పెద్దపల్లి, న్యూస్‌టుడే : ప్రజల్లో జాతీయవాదం పెరగడంతోనే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు అధిక ఓట్లు పడ్డాయని, ప్రజల సంపూర్ణ మద్దతుతో లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించనున్నట్లు ఆ పార్టీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస ధీమా వ్యక్తం చేశారు. పెద్దపల్లిలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పెద్దపల్లిలో తాను గెలుపొందడంతో పాటు కేంద్రంలో మూడోసారి భాజపా అధికారం చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిచిపోయిందని, ప్రభుత్వం తడిచిన ధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేంత వరకు తమ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు తడిచిన ధాన్యం కొనుగోళ్లపై ఒక్క మాట చెప్పడం లేదని, కనీసం కొనుగోలు కేంద్రాలను పరిశీలించాల్సిన బాధ్యతను సైతం విస్మరించారన్నారు. పార్టీ పార్లమెంట్‌ కన్వీనర్‌ వెంకటేశ్‌గౌడ్, కో కన్వీనర్‌ లక్ష్మణ్‌యాదవ్, రాజ్‌గోపాల్, సంతోష్, శ్రీనివాస్, శివాజీ, లావణ్యలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని