logo

యువకుడికి హెల్పింగ్ హ్యాండ్స్ చేయూత

కమాన్‌పూర్ మండల కేంద్రానికి చెందిన నిరుపేద యువకుడు కల్వల సతీశ్‌ ఆర్థికంగా ఎటువంటి వనరులు లేక చెట్టు కింద చిన్న టీ స్టాల్ నడిపిస్తున్నాడు

Updated : 21 May 2024 15:20 IST

కమాన్‌పూర్: కమాన్‌పూర్ మండల కేంద్రానికి చెందిన నిరుపేద యువకుడు కల్వల సతీశ్‌ ఆర్థికంగా ఎటువంటి వనరులు లేక చెట్టు కింద చిన్న టీ స్టాల్ నడిపిస్తున్నాడు. ఆయనకు మండల కేంద్రానికి చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ అండగా నిలిచింది. ముడి సరుకుల సాయంతో సుమారుగా రూ.21వేలు పెట్టుబడితో అతనికి కొత్త టీ క్యాబిన్‌తో ఏర్పాటు చేశారు. ఈ సాయాన్ని హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు నారగోని సతీశ్‌, ఆసం శ్రీకాంత్ అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని