logo

ఎన్నికల వేళ తగ్గిన రిజిస్ట్రేషన్లు

ఎన్నికల కారణంగా గతేడాదితో పోల్చితే ఈసారి రిజిస్ట్రేషన్లు తగ్గాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా అన్ని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ఈ ఏడాది ఆదాయం విపరీతంగా తగ్గింది.

Updated : 25 May 2024 02:23 IST

కరీంనగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో తక్కువ సంఖ్యలో క్రయవిక్రయదారులు

న్యూస్‌టుడే, కరీంనగర్‌ సంక్షేమ విభాగం: ఎన్నికల కారణంగా గతేడాదితో పోల్చితే ఈసారి రిజిస్ట్రేషన్లు తగ్గాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా అన్ని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ఈ ఏడాది ఆదాయం విపరీతంగా తగ్గింది. గత ఏడాది 2023లో జనవరి నుంచి మే వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40,449 రిజిస్ట్రేషన్లు కాగా రూ.13,671.51 లక్షల ఆదాయం వచ్చింది. ఎన్నికల కోడ్‌ సందర్భంగా ఈ ఏడాది జనవరి నుంచి మే 22 వరకు 34,686 రిజిస్ట్రేషన్లగాను రూ.10,515.82 లక్షలు వచ్చాయి. గత ఆదాయాన్ని పోల్చి చూస్తే ఈ ఏడాది రూ.3155.69 లక్షలు తక్కువగా వచ్చింది.

కారణాలు ఇలా..

భూముల క్రయవిక్రయాల్లో ఎక్కువగా ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు ఉంటుంటారు. ఎన్నికలు వేళ వారు బిజీగా ఉండటంతో క్రయవిక్రయాలు తగ్గిపోయాయి. దీనికితోడు ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్‌ విధించడంతో నగదు అక్రమ రవాణా అరికట్టేందుకు ఎన్నికల కమిషన్‌ పలు బృందాలు ఏర్పాటు చేసింది. పలువురు క్రయ విక్రయదారులు రిజిస్ట్రేషన్లు చేసుకునే క్రమంలో వారి దగ్గర ఉన్న నగదుకు ఆధారాలున్నా అప్పటికప్పుడు వాటిని చూపించకపోతే ఆ నగదును సీజ్‌ చేస్తారు. ఈ క్రమంలో సాధారణ వ్యక్తులు కూడా ఎన్నికల కోడ్‌ తర్వాతే రిజిస్ట్రేషన్‌ చేసుకుందామని వేచి చూశారు. ఈ రెండు కారణాలతో కార్యాలయానికి వచ్చే వారి సంఖ్య తగ్గిపోయింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని