logo

స్వశక్తి సంఘాలకు రుణ లక్ష్యం ఖరారు

రాష్ట్రప్రభుత్వం టీసెర్ప్‌ మహిళా స్వశక్తి సంఘాలకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులింకేజీ రుణలక్ష్యాన్ని ఇటీవలే నిర్దేశించింది.

Published : 28 May 2024 04:16 IST

న్యూస్‌టుడే, జగిత్యాల ధరూర్‌క్యాంపు

రాష్ట్రప్రభుత్వం టీసెర్ప్‌ మహిళా స్వశక్తి సంఘాలకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులింకేజీ రుణలక్ష్యాన్ని ఇటీవలే నిర్దేశించింది. జిల్లాలోని 18 మండలాల్లో 12,632 సంఘాలకు రూ.765.66 కోట్ల లింకేజీ రుణాన్ని మంజూరిచ్చేలా ప్రణాళికను రూపొందించారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో నిర్దేశిత లక్ష్యాన్నిదాటి రుణాలను పంపిణీ చేయగా రికవరీలోనూ ప్రగతిని సాధించారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ నిర్దేశిత రుణలక్ష్యాన్ని పూర్తిచేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇదివరకు ప్రభుత్వం ద్వారా రుణాలను తీసుకున్న వారందరూ తమ ఆదాయాన్ని అభివృద్ధి చేసుకునేలా నూనెలు, పొడుల తయారీ, కిరాణాలు, పప్పుల మిల్లులు, ఇతరత్రా ఉపఉత్పత్తుల తయారీకిగాను భిన్నమైన యూనిట్లను నెలకొల్పుకున్నారు. మహిళలు తయారుచేసిన ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేస్తున్నట్లు టీసెర్ప్‌ జగిత్యాల ఏపీఎం వోదెల గంగాధర్‌ పేర్కొన్నారు. మరోవైపు మహిళా సంఘాలు చెల్లించిన వడ్డీని ప్రభుత్వం తిరిగి సంఘాల ఖాతాలో జమచేయాల్సి ఉండగా దాదాపుగా మూడేళ్లవడ్డీ పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో వడ్డీ చెల్లిస్తామని, వడ్డీలేని రుణ పథకాన్ని చేపడతామన్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన అమలుతో సంఘాలకు మరింతగా ప్రోత్సాహకరంగా మారనుంది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు