logo

దేశానికి ఉపయోగపడే ఆవిష్కరణలు అవసరం

విద్యార్థులు దేశానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేపట్టాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు.

Published : 04 Dec 2022 06:07 IST

విద్యార్థుల ప్రదర్శనలను తిలకిస్తున్న ఎమ్మెల్యే రవిశంకర్‌, జిల్లా పాలనాధికారి కర్ణన్‌

చొప్పదండి, న్యూస్‌టుడే: విద్యార్థులు దేశానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేపట్టాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు. శనివారం మండలంలోని రుక్మాపూర్‌ గురుకుల సైనిక పాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి ఆర్వీ కర్ణన్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని అన్నారు. నూతన ఆవిష్కరణలు చేసేలా ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. సైనిక పాఠశాల విద్యార్థులు గౌరవ వందనం చేశారు. అనంతరం చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లా నుంచి 471, ఇన్‌స్పైర్‌ విభాగంలో 80 మంది మొత్తం 551 మంది ఆవిష్కరణలు ప్రదర్శించారు. ఆదివారం విజేతలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు కనమల్ల విజయ, జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు, జిల్లా సైన్స్‌ అధికారి జైపాల్‌రెడ్డి, ఎంపీపీ రవీందర్‌, ప్రధానాచార్యులు లచ్చయ్య, డీసీఈబీ కార్యదర్శి స్వదేశ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని