దేహదారుఢ్య పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి ఆధ్వర్యంలో జరిగిన ఎస్సై, కానిస్టేబుల్ అర్హత పరీక్ష రాసి అర్హులైన అభ్యర్థులకు ఈనెల 8వ తేదీ నుంచి 31వ తేదీ వరకు దేహదారుఢ్య ఎంపిక పరీక్షలను నిర్వహిస్తున్నారు.
ఎంపిక ప్రదేశాన్ని పరిశీలిస్తున్న రాష్ట్ర అధికారులు
కరీంనగర్ నేరవార్తలు, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి ఆధ్వర్యంలో జరిగిన ఎస్సై, కానిస్టేబుల్ అర్హత పరీక్ష రాసి అర్హులైన అభ్యర్థులకు ఈనెల 8వ తేదీ నుంచి 31వ తేదీ వరకు దేహదారుఢ్య ఎంపిక పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర, కమిషనరేట్ అధికారులు సంబంధిత ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్ మానేరు జలాశయం సమీపంలో ఉన్న పోలీసు శిక్షణ కేంద్రం(సీటీసీ)లో వీటిని నిర్వహిస్తున్నారు. ఈనెల 8వ తేదీన నుంచి ప్రతి రోజు 5 గంటలకు ఎంపికలు ప్రారంభం కానున్నాయి. ప్రతి రోజు 1000-1200 మంది హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి పరీక్షలో నెగ్గిన వారే మరో పరీక్షకు అర్హత సాధిస్తారు. అభ్యర్థులకు నిర్వహించిన ప్రతి అర్హత పరీక్ష వద్ద అధికారులు ఎలాంటి పొరపాట్లు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. మహిళా అభ్యర్థుల ఎంపిక పోటీలను ఈనెల 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నారు. ఎంపిక అభ్యర్థుల పూర్తి వివరాలను ఆన్‌లైన్ ద్వారా పోలీసు శాఖ నియామక మండలం సర్వర్‌లో పొందుపరుస్తారు.
ఈ జాగ్రత్తలు పాటించండి..
* అడ్మిట్ కార్డులో కేటాయించిన తేదీల్లో మాత్రమే హాజరుకావాలి.
* ఒకసారి లోనికి అనుమతించిన వారిని మళ్లీ బయటకు పంపించరు.
* ఆహారం, పండ్లు తప్ప చరవాణి(సెల్), ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న వస్తువులను అనుమతించరు.
* ఆర్‌ఎఫ్‌ఐడీ రిస్ట్ బ్యాండ్స్, బిబ్ జాకెట్లు ఉపయోగించి అభ్యర్థులను పరీక్షిస్తారు.
* బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు తీసుకుంటారు. కాబట్టి గోరింటాకు, రంగులు వేసుకోవద్దు.
* రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి జారీ చేసిన అడ్మిట్కార్డు, ఆన్‌లైన్ సమాచారం పత్రం తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి.
* అభ్యర్థి పార్టు-2 దరఖాస్తు ఫారం దగ్గర ఉంచుకోవాలి.
* కుల, విద్య ధ్రువీకరణ అసలు, జిరాక్స్ పత్రాలు వెంట పెట్టుకోవాలి.
* సైనిక ధ్రువపత్రం(పీపీటీ, డిస్‌ఛార్జి బుక్) నిరభ్యంతర పత్రం (సర్వీసునుంచి డిస్‌ఛార్జి కానివారికి)
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Amaravati: విభజన చట్టం ప్రకారం అమరావతే రాజధాని.. మరోసారి తేల్చి చెప్పిన కేంద్రం
-
Movies News
Amigos: ఆ పాట చూశాక అందరూ షాక్ అవుతారు: కల్యాణ్ రామ్
-
India News
Subramanian Swamy: అదానీ గ్రూపు ఆస్తులన్నీ జాతీయం చేసి.. వేలం వేయాలి..!
-
Sports News
IND vs AUS: తొలి టెస్టు కోసం దినేశ్ కార్తిక్ ప్లేయింగ్ XI ఇదే!.. గిల్, కుల్దీప్కు దక్కని చోటు
-
Politics News
Mekapati Chandrasekhar Reddy: వైకాపా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి అస్వస్థత
-
India News
Modi: ‘బ్లూ జాకెట్’తో ‘గ్రీన్’ మెసేజ్ ఇచ్చిన ప్రధాని మోదీ..!