రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
హుజూరాబాద్-జమ్మికుంట ప్రధాన రహదారిపై హుజూరాబాద్ మండలం రంగాపూర్ ప్రధాన కూడలి సమీపంలో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
మరొకరికి తీవ్ర గాయాలు
రాజయ్య
హుజూరాబాద్ గ్రామీణం, న్యూస్‌టుడే: హుజూరాబాద్-జమ్మికుంట ప్రధాన రహదారిపై హుజూరాబాద్ మండలం రంగాపూర్ ప్రధాన కూడలి సమీపంలో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం హనుమకొండ జిల్ల్లా కమలాపూర్ మండలం వంగపల్లికి చెందిన కొలిపాక రాజయ్య(50) రంగాపూర్‌లోని బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరయ్యాడు. ఈ క్రమంలో కాలినడకన రహదారి దాటుతుండగా హుజూరాబాద్‌కు చెందిన పైవర్తి కనుకయ్య ద్విచక్రవాహనంపై జమ్మికుంట నుంచి హుజూరాబాద్ వైపునకు వస్తూ రాజయ్యను ఢీకొట్టాడు. అతడు అక్కడికక్కడే మృతి చెందగా, కనుకయ్య తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది పైలట్ రమేష్, ఈఎంటీ బద్రీ ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఏఎస్‌ఐ రాంమూర్తి, హెడ్‌కానిస్టేబుల్ బాల్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు రాజయ్య హన్మకొండలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తుండేవాడు. అతడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. గాయపడిన కనుకయ్య చరవాణి టవర్ సాంకేతిక నిపుణుడిగా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Russia: చిన్నారి ‘చిత్రం’పై రష్యా కన్నెర్ర.. తండ్రిని బంధించి..బాలికను దూరం చేసి!
-
World News
USA: వడదెబ్బతో విద్యార్థి మృతి.. కుటుంబానికి రూ.110 కోట్ల నష్ట పరిహారం
-
Politics News
Rahul Gandhi: ‘గుర్రాల రేసులో గాడిద..!’ కేంద్ర మంత్రి పురీ వ్యంగ్యాస్త్రాలు
-
Sports News
IPL 2023: శ్రేయస్‌కు గాయం... కోల్‌కతా నైట్ రైడర్స్ సారథిగా యువ ఆల్‌రౌండర్
-
India News
Anurag Thakur: రాహుల్ కలలో కూడా సావర్కర్ కాలేరు..: అనురాగ్ ఠాకూర్
-
World News
USA: అగ్రరాజ్యంలో మరోసారి పేలిన తుపాకీ.. ముగ్గురు విద్యార్థులు సహా ఆరుగురు మృతి