logo

చిరుధాన్యాల ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం

పుష్కలంగా పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలున్న చిరుధాన్యాలను ప్రతి రోజు ఆహారంలో భాగంగా చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

Published : 28 Mar 2023 05:27 IST

చిరుధాన్యాల ఆహార పదార్థాలను పరిశీలిస్తున్న మంత్రి కమలాకర్‌

కరీంనగర్‌ మంకమ్మతోట, న్యూస్‌టుడే: పుష్కలంగా పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలున్న చిరుధాన్యాలను ప్రతి రోజు ఆహారంలో భాగంగా చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. పోషణ పఖ్వాడ పక్షోత్సవాల్లో భాగంగా మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఆవరణలో చిరుధాన్యాల మేళా నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. మన పూర్వీకులు తృణధాన్యాలను ఎక్కువగా తీసుకోవడం మూలంగానే రక్తపోటు, మధుమేహంలాంటి దీర్ఘకాలిక వ్యాధులు లేకుండా ఎక్కువ రోజులు జీవించారన్నారు. ఈ సందర్భంగా పలు స్టాళ్లను పరిశీలించిన ఆయన, తృణ ధాన్యాలతో చేసిన ఆహార పదార్థాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ పరిశోధన కేంద్రం, ఉట్నూర్‌ ఐటీడీఏ బృందం, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం, అంగన్‌వాడీ సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి. జడ్పీ సీఈవో ప్రియాంక, డీడబ్ల్యూవో సబిత తదితరులు పాల్గొన్నారు.

పల్లె ప్రగతితో గ్రామాల్లో అభివృద్ధి

కరీంనగర్‌ కలెక్టరేట్‌ : పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో అభివృద్ధి కనిపిస్తోందని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నిర్వహించిన దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ పంచాయతీ సతత్‌ వికాస్‌ పురస్కార్‌ జిల్లా స్థాయి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరీంనగర్‌, మానకొండూర్‌, చొప్పదండి నియోజకవర్గాలకు చెందిన 11 మండలాల్లోని 27 గ్రామ పంచాయతీల ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందికి పురస్కారాలను ప్రదానం చేశారు. కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ విజయ, మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, సుడా ఛైర్మన్‌ జీవీ.రామకృష్ణారావు, అదనపు పాలనాధికార్లు గరిమ అగ్రవాల్‌, శ్యాంప్రసాద్‌లాల్‌, శిక్షణ కలెక్టర్‌ లెనిన్‌ వత్సల్‌, డీపీవో వీరబుచ్చయ్య, డీఆర్డీవో ఎల్‌.శ్రీలత, జిల్లా వైద్యాధికారి జువేరియా, జిల్లా సంక్షేమాధికారి సబిత పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని