logo

రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోరీ

ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలోని రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం గురువారం ఉదయం గీతా కార్మికులు ఎల్లమ్మ ఆలయం వద్దకు వెళ్లేసరికి తలుపులు పగలగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా..

Published : 08 Dec 2023 04:35 IST

ఇల్లందకుంట, న్యూస్‌టుడే; ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలోని రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం గురువారం ఉదయం గీతా కార్మికులు ఎల్లమ్మ ఆలయం వద్దకు వెళ్లేసరికి తలుపులు పగలగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా.. అమ్మవారి హుండీ, ముక్కు పుడకా, మెడలోని హారం గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. హుండీతో కలిపి వాటి విలువ రూ.30 వేలు ఉంటుదన్నారు. మండల గౌడ సంఘం అధ్యక్షుడు మహేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని