logo

ఖని ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు మృతి

గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం కోసం వచ్చిన మహిళ కడుపులో శిశువు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతిచెందిందని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళ బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 08 Dec 2023 04:43 IST

మృతి చెందిన చిన్నారిని చూపుతున్న కుటుంబ సభ్యులు

గోదావరిఖని, న్యూస్‌టుడే: గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం కోసం వచ్చిన మహిళ కడుపులో శిశువు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతిచెందిందని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళ బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గోదావరిఖని బాపూజీనగర్‌కు చెందిన గర్భిణి రజితకు నెలలు నిండటంతో ప్రసవం కోసం ఆమెకుటుంబీకులు ప్రభుత్వ ఆస్పత్రికి బుధవారం తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసుకున్నారు. నెలలు నిండాయని.. శస్త్రచికిత్స ద్వారా ప్రసవం చేయాలని కోరినా వైద్యులు కాలయాపన చేశారని ఆరోపించారు. గురువారం ఉదయం పరిస్థితి విషమించింది గర్భంలోనే బిడ్డ చనిపోయిందని వైద్యులు తెలిపారన్నారు. సాయంత్రం శస్త్రచికిత్స చేసి మృతి చెందిన శిశువును తమకు అప్పగించినట్లు చెప్పారు. కేవలం వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందిందని ఆరోపించారు. రజిత భర్త పప్పుల గురుప్రసాద్‌తో పాటు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. కాగా మహిళకు ప్రసవానికి సంబంధించిన ఎలాంటి నొప్పులు రాలేదని ఖని ప్రభుత్వ ఆస్పత్రి స్త్రీవైద్య నిపుణురాలు అరుణ తెలిపారు. ఆమె ప్రసవానికి ఇంకా సమయం ఉండగా తెల్లవారు జామున పరిస్థితి ఒక్కసారిగా మారిందన్నారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని