logo

క్రీడా స్ఫూర్తి చాటాలి

క్రీడలతో విద్యార్థుల్లో మానసిక, శారీరక దృఢత్వం పెరుగుతుందని డీఈవో మాధవి అన్నారు. పెద్దపల్లి జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో రామగుండం లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ మగువ సౌజన్యంతో ఎల్కలపల్లిగేటు కాలనీలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో గురువారం ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించారు.

Published : 08 Dec 2023 04:49 IST

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న డీఈవో మాధవి

ఫెర్టిలైజర్‌ సిటీ, న్యూస్‌టుడే: క్రీడలతో విద్యార్థుల్లో మానసిక, శారీరక దృఢత్వం పెరుగుతుందని డీఈవో మాధవి అన్నారు. పెద్దపల్లి జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో రామగుండం లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ మగువ సౌజన్యంతో ఎల్కలపల్లిగేటు కాలనీలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో గురువారం ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువులో రాణించడంతో పాటు చక్కటి క్రమశిక్షణతో ముందుకు సాగాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే ప్రతి విద్యార్థి క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. వారికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తగిన ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు. ఈ పోటీల్లో బాలుర విభాగంలో కరీంనగర్‌ జిల్లా జట్టు ప్రథమ, పెద్దపల్లి జిల్లా జట్టు ద్వితీయ, బాలికల విభాగంలో సిరిసిల్ల జట్టు ప్రథమ, పెద్దపల్లి జిల్లా జట్టు ద్వితీయ బహుమతులు గెలుపొందారు. లయన్స్‌ క్లబ్‌ మగువ అధ్యక్షురాలు డాక్టర్‌ కేటీవై లక్ష్మీవాణి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా యువజన క్రీడా అధికారి సురేశ్‌, స్కూల్స్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శి శ్రీనివాస్‌, డాక్టర్‌ రవికుమార్‌, సారయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టి.విమల తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని