logo

మహిళలు సామాజికంగా ఎదగాలి

మార్వాడి మహిళలు సామాజికంగా, సాంస్కృతికం ఎదిగి సమాజంలో భాగస్వాములు కావాలని అఖిల భారత మార్వాడి మహిళా మండలి అధ్యక్షురాలు నీరాజీ బత్వాల్‌ అన్నారు. దక్షిణ భారత మార్వాడి మహిళా మండలిని విస్తృత పరిచేందుకు, సంఘాలను బలోపేతం చేసేందుకు జిల్లా పర్యటనకు వచ్చిన  సందర్భంగా గురువారం సాయంత్రం కరీంనగర్‌ మార్వాడి మందిర్‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

Published : 08 Dec 2023 04:52 IST

జాతీయ మార్వాడి మహిళా మండలి అధ్యక్షురాలు నీరాజీ బత్వాల్‌కు స్వాగతం పలుకుతున్న స్థానిక మగువలు

కరీంనగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: మార్వాడి మహిళలు సామాజికంగా, సాంస్కృతికం ఎదిగి సమాజంలో భాగస్వాములు కావాలని అఖిల భారత మార్వాడి మహిళా మండలి అధ్యక్షురాలు నీరాజీ బత్వాల్‌ అన్నారు. దక్షిణ భారత మార్వాడి మహిళా మండలిని విస్తృత పరిచేందుకు, సంఘాలను బలోపేతం చేసేందుకు జిల్లా పర్యటనకు వచ్చిన  సందర్భంగా గురువారం సాయంత్రం కరీంనగర్‌ మార్వాడి మందిర్‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అందరు కలిసికట్టుగా సమాజంలో కలిసిపోవాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళలు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. చరవాణితో నష్టాలు తెలియజేస్తూ, నారీ శక్తి గురించి, ఆహారం వృథా చేయొద్దని తెలియజేసే నాటకాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో మర్వాడి మహిళా మండలి దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షురాలు రేఖ, తెలంగాణ అధ్యక్షురాలు అరుణా జవ్వాల్‌, కరీంనగర్‌ జిల్లా అధ్యక్షురాలు సరళా ముందాడా, సంఘ ప్రతినిధి సునందా ముందాడా, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని