logo

పల్లెల్లో మద్యం జోరు

పల్లెల్లో మళ్లీ మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. నెల రోజులుగా ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో మద్యం అమ్మకాలు నిషేధించారు. కోడ్‌ ఎత్తేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఒక్కో గ్రామంలో 3 నుంచి 8 వరకు మద్యం గొలుసు దుకాణాల ఏర్పాటుతో పలువురు బానిసలుగా మారుతున్నారు.

Published : 08 Dec 2023 04:56 IST

గొలుసు దుకాణాలు తొలగించాలంటున్న ప్రజలు  

గొలుసు దుకాణంలో మద్యం

న్యూస్‌టుడే, జగిత్యాల గ్రామీణం : పల్లెల్లో మళ్లీ మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. నెల రోజులుగా ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో మద్యం అమ్మకాలు నిషేధించారు. కోడ్‌ ఎత్తేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఒక్కో గ్రామంలో 3 నుంచి 8 వరకు మద్యం గొలుసు దుకాణాల ఏర్పాటుతో పలువురు బానిసలుగా మారుతున్నారు. జిల్లాలో 380 గ్రామ పంచాయతీలు ఉండగా దాదాపు 1200కుపైగా మద్యం గొలుసు దుకాణాలు ఉన్నాయి. జిల్లాలో 71 మద్యం లైసెన్స్‌డ్‌ దుకాణాలు ఉండగా ప్రతి రోజు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు అమ్మకాలు సాగుతున్నాయి. మద్యం దుకాణాల్లో ఎంతమేర అమ్మకాలు సాగుతున్నాయో.. గొలుసు దుకాణాల్లోనూ రూ.1 కోటి నుంచి రూ.1.50 వరకు అమ్మకాలు సాగుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

నెల రోజులుగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావటంతో అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని, నిలువ చేసిన మద్యం నిలువలు పట్టుకోవాలని ఆదేశించటంతో నిఘా ఏర్పాటు చేసి రూ.కోట్ల మేర మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోడ్‌ ముగియటంతో యథాస్థితి నెలకొంది. ఇన్నాళ్లు పరిస్థితి బాగుండేందని ఇప్పుడు మళ్లీ మద్యం గొలుసు దుకాణాలు వెలిసినట్లు గ్రామీణ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మద్యం అమ్మకాలు పెరగటంతో రోజు కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయని, కూలీనాలి చేసుకునే వారు వచ్చే ఆదాయంలో సగానికి పైగా మద్యానికి ఖర్చు చేస్తేబతికేది ఎలా అని గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆబ్కారీశాఖ మద్యం గొలుసు దుకాణాలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమైంది. గత కొన్నెళ్లుగా విక్రయాలు ఎలా పెంచాలి అనే అంశంపైనే పనిచేశారనే విమర్శలు వచ్చాయి. కొత్త ప్రభుత్వం మద్యం గొలుసు దుకాణలను ఎత్తివేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని గ్రామీణ ప్రాంత మహిళలు వేచిచూస్తున్నారు. ఆబ్కారీశాఖ సైతం మద్యం అమ్మకాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని