logo

మంత్రి చొరవతో చివరి ఆయకట్టు

మధ్యమానేరు కుడి కాలువ ద్వారా ఎండిపోతున్న తమ పంట పొలాలకు తక్షణమే సాగు నీరందించాలని జాగీర్‌పల్లి, గుజ్జులపల్లి గ్రామాలకు చెందిన రైతులు సోమవారం మందు డబ్బాలతో నిరసన వ్యక్తం చేసిన విషయం విదితమే.

Updated : 22 Feb 2024 06:05 IST

భూములకు సాగు నీరు

సైదాపూర్‌, న్యూస్‌టుడే : మధ్యమానేరు కుడి కాలువ ద్వారా ఎండిపోతున్న తమ పంట పొలాలకు తక్షణమే సాగు నీరందించాలని జాగీర్‌పల్లి, గుజ్జులపల్లి గ్రామాలకు చెందిన రైతులు సోమవారం మందు డబ్బాలతో నిరసన వ్యక్తం చేసిన విషయం విదితమే. పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించిన రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ స్పందించారు. ఆయకట్టు గ్రామాలైన గుజ్జులపల్లి, జాగీర్‌పల్లి గ్రామాలకు మధ్యమానేరు జలాశయం నుంచి సాగు నీటిని అందించాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన ఉప కాలువలకు మరమ్మతు చేపట్టి బుధవారం సాయంత్రం వరకు గుజ్జులపల్లి గ్రామ రైతులకు సాగు నీరందేలా అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు సుధాకర్‌, జిల్లా నాయకులు శ్రీనివాస్‌, కొండాల్‌రెడ్డిలు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని