logo

సారలమ్మ ఆగమనం.. పులకించిన భక్తజనం

కోల్‌బెల్ట్‌వద్ద సమ్మక్క-సారలమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది. తల్లుల కోసం ఎదురు చూస్తున్న భక్తులు సారలమ్మ ఆగమనంతో పులకరించిపోయారు.

Published : 22 Feb 2024 04:54 IST

గోదావరిఖని, న్యూస్‌టుడే: కోల్‌బెల్ట్‌వద్ద సమ్మక్క-సారలమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది. తల్లుల కోసం ఎదురు చూస్తున్న భక్తులు సారలమ్మ ఆగమనంతో పులకరించిపోయారు. బుధవారం రాత్రి బి-గెస్ట్‌హౌస్‌ సమీపంలోని ఆలయం నుంచి సారలమ్మతో బయలుదేరిన కోయపూజారులకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కోయపూజారులను తాకేందుకు భక్తులు పోటీ పడ్డారు. రాత్రి 9 గంటలకు జాతర ప్రాంగణానికి చేరుకుని గద్దెపై ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. దీంతో తోపులాట నెలకొంది. డప్పులతో సారలమ్మను తీసుకువస్తున్న సమయంలో భక్తులు వరం పట్టారు. భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు చేసి తలనీలాలు సమర్పించారు. ఎత్తు బంగారంతో మొక్కులు అప్పగించారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్‌, నగర కమిషనర్‌ శ్రీకాంత్‌ అమ్మవార్లను దర్శించుకున్నారు.

అంతర్గాం అంతర్గాం మండలం గోయల్‌వాడ సమ్మక్క, సారలమ్మ జాతరకు భక్తులు భారీఎత్తున తరలివస్తున్నారు. బుధవారం రాత్రి కోయపూజారులు సారలమ్మను గద్దెలపైకి చేర్చారు. శివసత్తుల పూనకాలతో జాతర ప్రాంగణం మార్మోగింది. జాతర ప్రదేశంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. రామగుండం ఎస్టీ కాలనీ వద్ద అంతర్గాం బైపాస్‌ రోడ్డుపై ఉన్న గుంతలను ఎమ్మెల్యే స్వయంగా జేసీబీ నడుపుతూ పూడ్చారు. భక్తుల రాకపోకలకు ఇక్కట్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని