logo

భక్తుల మొక్కులు.. శివసత్తుల పూనకాలు

డప్పు చప్పుల్లు.. శివసత్తుల పూనకాలు.. టపాసుల మోతలు.. భారీ బందోబస్తు మధ్య రేకుర్తిలో సారలమ్మ కొలువుదీరింది. బుధవారం సాయంత్రం    6.50 గంటలకు మేడారం కోయ పూజారి విఘ్నేష్‌ ఎరుకలి గుట్టపై పూజలు నిర్వహించి.

Published : 22 Feb 2024 05:18 IST

జన జాతరల్లో కొలువుదీరిన సారలమ్మ

న్యూస్‌టుడే, కరీంనగర్‌ కొత్తపల్లి: డప్పు చప్పుల్లు.. శివసత్తుల పూనకాలు.. టపాసుల మోతలు.. భారీ బందోబస్తు మధ్య రేకుర్తిలో సారలమ్మ కొలువుదీరింది. బుధవారం సాయంత్రం    6.50 గంటలకు మేడారం కోయ పూజారి విఘ్నేష్‌ ఎరుకలి గుట్టపై పూజలు నిర్వహించి.. సారలమ్మను జన సందోహం, ప్రత్యేక రోప్‌పార్టీ బందోబస్తు మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు. ఆ సమయంలో శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. గద్దెకు చేరుకున్న వెంటనే భక్తులు సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించి ఒడిబియ్యం సమర్పించారు. భక్తులు ఎత్తుబంగారం (బెల్లం), కోడి మొక్కులు చెల్లించుకున్నారు. రూరల్‌ సీఐ ప్రదీప్‌ కుమార్‌, కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి ఆధ్వర్యంలో 150 పోలీసు సిబ్బంది, వాలంటీర్లు బందోబస్తు నిర్వహించారు. శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడినా, తోపులాట జరిగినా వెంటనే స్పందించేందుకు ప్రత్యేక బలగాలను అందుబాటులో ఉంచారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా వైద్య, రెవెన్యూ, నగరపాలక సంస్థ, విద్యుత్తు, దేవాదాయశాఖ, పోలీసుశాఖల సహాయ, సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని