logo

బ్రహ్మోత్సవం.. శోభాయమానం

విభిన్న కళారూపాలు.. వైవిధ్య వాయిద్య కళా ప్రదర్శనలు.. నందికోలా.. ఘటం.. ఒగ్గుడోలు.. మహిళ డప్పు చప్పుళ్లు, గుస్సాడీ, కేరళ మేళం, హరిదాసులు, దశావతార రూపాలు.. బోనాలు.. కోలాటాలు.. బంజరా.. చిరుతల భజన, తదితర ప్రదర్శనలతో పాటు అశ్వాలు.. ఒంటెలు.. గోమాతలతో సాగిన బ్రహ్మోత్సవ శోభాయాత్ర శోభాయమానంగా సాగింది.

Published : 22 Feb 2024 05:23 IST

కరీంనగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: విభిన్న కళారూపాలు.. వైవిధ్య వాయిద్య కళా ప్రదర్శనలు.. నందికోలా.. ఘటం.. ఒగ్గుడోలు.. మహిళ డప్పు చప్పుళ్లు, గుస్సాడీ, కేరళ మేళం, హరిదాసులు, దశావతార రూపాలు.. బోనాలు.. కోలాటాలు.. బంజరా.. చిరుతల భజన, తదితర ప్రదర్శనలతో పాటు అశ్వాలు.. ఒంటెలు.. గోమాతలతో సాగిన బ్రహ్మోత్సవ శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. బుధవారం రాత్రి రాంనగర్‌ మార్క్‌ఫెడ్‌ మైదానంలో శ్రీవారి ఉత్సవమూర్తి రథాన్ని అలంకరించారు.

శ్రీలక్ష్మీ భూమాత సహిత వేంకటేశ్వర స్వామిమూర్తులు దివ్యంగా భక్తులకు దర్శనమిచ్చారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య మంత్రి పొన్నం ప్రభాకర్‌ పూజలు నిర్వహించి స్వామి వారి శోభాయాత్ర ప్రారంభించారు. సల్వాజీ ప్రవీణ్‌ ఆధ్వర్యంలో కళారూపాల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. దారిపొడవునా కళాకారుల నృత్యాలు..ఉత్సవాల్లో పాల్గొన్న ఏడు వాహనాలు.. అశ్వాలు, ఒంటెలు, గోమాతలు కనువిందు చేశాయి. టీపీసీసీ అధికార ప్రతినిధి మేనేని రోహిత్‌రావు భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు వితరణ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని