logo

పది మంది వైద్య సిబ్బందికి మెమోలు

కరీంనగర్‌ మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో నవజాత శిశువు అపహరణకు గురైన ఘటనపై ఈనెల 20న ‘ఈనాడు’లో ‘మాతా...శిశువులకు రక్షణ కరవు’ అని ప్రచురితమైన కథనానికి సూపరింటెండెంట్‌ వీరారెడ్డి స్పందించారు.

Published : 23 Feb 2024 03:56 IST

కరీంనగర్‌ సంక్షేమ విభాగం, న్యూస్‌టుడే: కరీంనగర్‌ మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో నవజాత శిశువు అపహరణకు గురైన ఘటనపై ఈనెల 20న ‘ఈనాడు’లో ‘మాతా...శిశువులకు రక్షణ కరవు’ అని ప్రచురితమైన కథనానికి సూపరింటెండెంట్‌ వీరారెడ్డి స్పందించారు. విధుల్లో ఉన్న సిబ్బందిపై విచారణ జరిపి 10 మంది వైద్య సిబ్బందికి గురువారం మెమోలు జారీ చేశారు. అనంతరం వారితో సమావేశం ఏర్పాటు చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాస్‌లను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. వైద్య బృందం రక్షణ సిబ్బంది సరిగా పనిచేయడంలేదని ఆయన దృష్టికి తీసుకురాగా  విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు రక్షణ సిబ్బందిని విధుల్లో నుంచి పూర్తిగా తొలగించాలని ఏజిల్‌ కంపెనీ పారిశుద్ధ్య గుత్తేదారుకు నోటీసులు అందజేశారు. ఆసుపత్రిలో 24 గంటలు బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఏవైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూపరింటెండెంట్‌ కోరారు.


భూకబ్జా కేసులో మాజీ సర్పంచి అరెస్టు

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: భూకబ్జా కేసుల్లో గంగాధర మండలం గట్టుబూత్కూర్‌ మాజీ సర్పంచి గంగాధర కనకయ్యను గురువారం అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు కొత్తపల్లి పోలీసులు తెలిపారు. ఎర్రం కనకారెడ్డి ఫిర్యాదు మేరకు నందెల్లి మహిపాల్‌తో మరో 9 మంది మంది కేసు నమోదు చేశారు. మూడు రోజుల కిందట మహిపాల్‌ను కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదే కేసులో ఏ4గా ఉన్న కనకయ్యను గురువారం అరెస్టు చేసి జైలుకు తరలించారు. కోర్టు రిమాండ్‌ విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని