logo

ప్రముఖ నాటక కళాకారుడు రాజేశం మృతి

దాదాపు నాలుగు దశాబ్దాలుగా నాటక రంగంలో ఎన్నో ప్రదర్శనలిచ్చి, జూనియర్‌ కళాకారులకు స్ఫూర్తిగా నిలిచిన నాటక రంగ ప్రముఖుడు మ్యాడారం రాజేశం(65) బుధవారం రాత్రి హఠాన్మరణం చెందారు.

Published : 23 Feb 2024 04:04 IST

రాజేశం

కరీంనగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే:  దాదాపు నాలుగు దశాబ్దాలుగా నాటక రంగంలో ఎన్నో ప్రదర్శనలిచ్చి, జూనియర్‌ కళాకారులకు స్ఫూర్తిగా నిలిచిన నాటక రంగ ప్రముఖుడు మ్యాడారం రాజేశం(65) బుధవారం రాత్రి హఠాన్మరణం చెందారు. లఘు చిత్ర నిర్వాహకులు, నీటి పారుదల, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారుల్లో విషాదం నెలకొంది. కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన ఈయన ఎల్‌ఎండీ క్యాంపులో శిక్షకులుగా, డ్రాఫ్ట్‌మెన్‌గా జేటీవోగా పని చేశారు. ఉద్యోగ సమయంలో నాటక రంగంపై ఆసక్తితో నాలుగు దశాబ్దాల కిందట ఎల్‌ఎండీలో గ్రామ నవోదయ సమితి, నీటి పారుదల శాఖ ఉద్యోగి గోపన్నతో కలిసి శ్రీవేంకటేశ్వర కళాసమితి ప్రారంభించారు. అప్పటి కళాకారులు గోపన్న, నారాయణ, జ్ఞానేశ్వర్‌, కనకమూర్తితో కలిసి రాజేశం ఎల్‌ఎండీ రిక్రియేషన్‌ క్లబ్‌లో నాటకాలు ప్రదర్శించారు. ఈయన సహచరుడు తిమ్మాపూర్‌కు చెందిన కేతిరెడ్డి మల్లారెడ్డి టీవీ, సినిమాల్లో నటిస్తున్నారు. మల్లారెడ్డి, మున్ననూరి హనుమంతరావు, రాజేశ్వర్‌రావు, ఎం.రాజు, పబ్బ రాజమౌళి, సత్యనారాయణ, తదితరులతో కలిసి అక్షర ఉజ్వల, కళాజాతలు, బ్రహ్మోత్సవాలు, నాటక ప్రదర్శనలు ఇచ్చారు. రాజేశం మృతికి జిల్లా సాంస్కృతిక సంస్థలు, కళాకారుల సమాఖ్య అధ్యక్షుడు వై.ఎస్‌.శర్మ, కుమార్‌ మహర్షి, అనిల్‌కుమార్‌ గౌడ్‌, కృపాదానం, రఘువీర్‌సింగ్‌, కేతిరెడ్డి మల్లారెడ్డి, సంగెం రాధాకృష్ణ, రతన్‌కుమార్‌, రొడ్డ యాదగిరి, మంచాల రమేష్‌, తదితరులు సంతాపం ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు