logo

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్‌ మృతి చెందగా, ముగ్గురు వైద్య విద్యార్థినులకు స్వల్పగాయాలయ్యాయి. రెండో ఠాణా సీఐ వెంకటేష్‌ తెలిపిన వివరాల ప్రకారం..

Published : 23 Feb 2024 04:07 IST

అఫ్జలొద్దీన్‌

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్‌ మృతి చెందగా, ముగ్గురు వైద్య విద్యార్థినులకు స్వల్పగాయాలయ్యాయి. రెండో ఠాణా సీఐ వెంకటేష్‌ తెలిపిన వివరాల ప్రకారం...  నగరంలోని హుస్సేనీపురకు చెందిన మహ్మద్‌ అఫ్జలొద్దీన్‌(45) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారు. గురువారం ఉదయం నలుగురు వైద్య విద్యార్థులను కొత్తపల్లి వైద్య కళాశాలకు ఆటోలో తీసుకెళ్తున్నారు. మాతా, శిశు ఆరోగ్య కేంద్రం వద్ద ఎదురుగా వచ్చిన ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో ఆటో నేరుగా వెళ్లి ట్రాఫిక్‌ ఐలాండ్‌ను ఢీకొట్టింది. డ్రైవర్‌ డివైడర్‌పై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అఫ్జలోద్దిన్‌ను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. స్వల్పంగా గాయపడిన వైద్య విద్యార్థులు జిల్లా ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు కూతుళ్లున్నారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

మోహన్‌

కరీంనగర్‌ నేరవార్తలు : రాంగ్‌ రూట్లో ప్రయాణించిన ఓ కారు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడిని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కరీంనగర్‌ రూరల్‌ సీఐ ప్రదీప్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్‌ మండలం వల్లంపహాడ్‌కు చెందిన కొత్తూరి మోహన్‌(19) కార్మికుడిగా పని చేసుకుంటూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. బుధవారం రాత్రి మోహన్‌ పని నిమిత్తం ద్విచక్రవాహనంపై కరీంనగర్‌ వైపు వస్తున్నాడు. చొప్పదండి వైపు రాంగ్‌రూట్లో వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబసభ్యులు ఘటనాస్థలికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇతనికి తండ్రి రవి, తల్లి, సోదరి ఉన్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని