logo

పంట కాలం పూర్తయ్యే వరకు సాగునీరు

యాసంగి పంట కాలం పూర్తయ్యే వరకు మధ్య మానేరు జలాశయం నుంచి పంటలకు సాగు నీటిని సరఫరా చేస్తామని, ఇందుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ పేర్కొన్నారు.

Published : 23 Feb 2024 04:42 IST

సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌

ఎత్తు బంగారాన్ని వన దేవతలకు సమర్పిస్తున్న మంత్రి పొన్నం

సైదాపూర్‌, న్యూస్‌టుడే : యాసంగి పంట కాలం పూర్తయ్యే వరకు మధ్య మానేరు జలాశయం నుంచి పంటలకు సాగు నీటిని సరఫరా చేస్తామని, ఇందుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ పేర్కొన్నారు. గురువారం మండలంలోని వెన్నంపల్లి, సైదాపూర్‌ గ్రామాల్లోని సమ్మక్క, సారలమ్మ వన దేవతలను ఆయన దర్శించుకున్నారు. ఎత్తు బంగారం తులాభారం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వేసవిలో ఎక్కడ పంటలు ఎండకుండా, ఆయకట్టు చివరి భూములకు సైతం సాగు నీరు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా వ్యాప్తంగా వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, ఇప్పటికే సంబంధిత శాఖ అధికారులు, జిల్లా పాలనాధికారికి ఆదేశాలు జారీ చేశామన్నారు. అమ్మనగుర్తిలో విద్యుత్‌ ఉప కేంద్రం మంజూరు కాగా యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించేలా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నాయకులు దొంత సుధాకర్‌, గుండారపు శ్రీనివాస్‌, రాఘవులు, ప్రసాద్‌, రవీందర్‌, మల్లయ్య,  తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని