logo

కాకా.. వెంకటస్వామికి ఆ పేరెలా వచ్చింది?

కాంగ్రెస్‌ పార్టీ దివంగత, కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి ‘కాకా’గానే ఎక్కువ మందికి  సుపరిచితులు. ఆయనకు ఈ పేరు రావడం వెనుక ఆసక్తికర అంశం ఉంది.

Updated : 24 Apr 2024 07:25 IST

జి.వెంకటస్వామి

కాంగ్రెస్‌ పార్టీ దివంగత, కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి ‘కాకా’గానే ఎక్కువ మందికి  సుపరిచితులు. ఆయనకు ఈ పేరు రావడం వెనుక ఆసక్తికర అంశం ఉంది. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మేడారం(ప్రస్తుత రామగుండం) అసెంబ్లీ సెగ్మెంటు నుంచి వెంకటస్వామి అన్న కుమారుడు జి.ఈశ్వర్‌ 1972, 1978లలో విజయం సాధించారు. వెంకటస్వామి 1989లో మొదటిసారి పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలిచారు. అంతకుముందే ఆయన చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా ఈ ప్రాంతానికి కొత్త. ఈశ్వర్‌కు వెంకటస్వామి చిన్నాన్న కావడంతో ‘కాకా’ అని సంబోంధించేవారు. దీంతో ఇక్కడి నాయకులు కూడా ఆయనను అలాగే పిలవడం ప్రారంభించారు. అప్పటి నుంచి వెంకటస్వామి ‘కాకా’ పేరిట గుర్తింపు పొందారు. తదనంతర కాలంలో సొంత వర్గం ఏర్పడటం.. వరుసగా మూడు సార్లు ఎంపీగా ఎన్నికవడంతో పెద్దపల్లి లోక్‌సభ స్థానం ‘కాకా’ ఇలాకాగా మారింది.

 న్యూస్‌టుడే, గోదావరిఖని

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని