logo

భవానీకి టికెట్‌ కోసం పట్టు

హాసన టికెట్‌ భవానీకి కాకుండా, మరొకరికి ఇస్తే తాను అంగీకరించనని జనతాదళ్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ స్పష్టం చేశారు. ఆయన గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.

Published : 31 Mar 2023 02:54 IST

హాసన, న్యూస్‌టుడే : హాసన టికెట్‌ భవానీకి కాకుండా, మరొకరికి ఇస్తే తాను అంగీకరించనని జనతాదళ్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ స్పష్టం చేశారు. ఆయన గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల అనంతరం దళ్‌ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక వేళ హంగ్‌ వచ్చినా.. దళ్‌ సహకారం లేకుండా ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదన్నారు. భవానీకి అవకాశమిస్తే, ఆమెను గెలిపించే బాధ్యత తనదని చెప్పారు. హాసనలో దళ్‌ అభ్యర్థిపై ఘన విజయాన్ని సాధిస్తానని భాజపా అభ్యర్థి ప్రీతం గౌడ చేసిన సవాలును తాను స్వీకరించి- ఆ సవాలుకు కట్టుబడి ఉన్నానని రేవణ్ణ పేర్కొన్నారు. ఈ విషయమై పార్టీ నాయకులం అందరూ కలిసి చర్చించి తీర్మానిస్తామని హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు. త్వరలోనే ‘హాసన’ ఎవరికి కేటాయిస్తామో ప్రకటిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని