logo

హావేరి జిల్లాలో ప్రమాదం.. నలుగురి దుర్మరణం

తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళుతున్న సమయంలో రాణెబెన్నూరు సమీపంలోని హలగేరిబైపాస్‌ వద్ద శుక్రవారం వేకువ జామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు.

Published : 25 May 2024 01:54 IST

బోల్తా కొట్టి.. నుజ్జయిన వాహనం

హావేరి, న్యూస్‌టుడే : తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళుతున్న సమయంలో రాణెబెన్నూరు సమీపంలోని హలగేరిబైపాస్‌ వద్ద శుక్రవారం వేకువ జామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. హావేరిలోని అశ్విని కాలనీకి చెందిన సురేశ్‌ వీరప్ప జాడి (45), ఐశ్వరయ్య ఈరప్ప బార్కి (22), చేతనా ప్రభురాజ సమగండి (7), పవిత్రా ప్రభురాజ సమగండి (28) అనే వ్యక్తులను మృతులుగా గుర్తించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చెన్నవీరప్ప జాడి, సావిత్ర జాడి, వికాస్‌ హొన్నప్ప బార్కి, నీలప్ప బార్కె, ప్రభురాజ ఈరప్ప, గీతా హొన్నప్పలకు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం దావణగెరెలోని ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని గుర్తించారు. వంతెన పైనుంచి కారు కిందపడడంతో ప్రమాదం సంభవించింది. రాణె బెన్నూరు గ్రామీణ ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

లారీ ఢీకొని.. మరో నలుగురు..

చిక్కమగళూరు: మూడిగెరె తాలూకా బణకల్‌ సమీపంలో శుక్రవారం ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని మంగళూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ధర్మస్థల మంజునాథ స్వామి దర్శనం ముగించుకుని చిత్రదుర్గకు వెళుతున్న సమయంలో వీరి కారును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. మూడిగెరె గ్రామీణ ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

చెన్నపట్టణలో విషాదం

చిత్రదుర్గం: చిక్కమగళూరులో చోటుచేసుకున్న ఓ ప్రమాదం చిత్రదుర్గం జిల్లా హొళల్కెరె తాలూకా చెన్నపట్టణలో విషాదాన్ని నింపింది. మూడిగెరె తాలూకా బణకల్‌ సమీపాన ఆ ప్రమాదంలో ఈ గ్రామానికి చెందిన నలుగురు చనిపోయిన వార్త కలచివేసింది. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. హంపయ్య అనే పెద్దాయన బంధువులు 16 మంది రెండు కార్లలో ధర్మస్థల యాత్రకు పయనమయ్యారు. వెనుతిరిగి వస్తున్న సమయంలో ఓ కారుకు ప్రమాదం వాటిల్లింది. హంపయ్య (65)తో పాటు మంజయ్య (60), ప్రభాకర్‌ (45), ప్రేమ (58) అనే వారు కన్నుమూశారని బంధువులు ధ్రువీకరించారు. రెండో కారులోని వారూ ప్రమాదాన్ని కొద్దిలో తప్పించుకున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు