logo

Rave Party: రేవ్‌పార్టీ వ్యవహారంలో నిర్లక్ష్యం.. ముగ్గురు పోలీసులపై వేటు

నగర శివార్లలో ఇటీవల నిర్వహించిన రేవ్‌పార్టీ వ్యవహారం పోలీస్‌ శాఖలోనూ కలకలం రేపుతోంది.

Updated : 25 May 2024 08:51 IST

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : నగర శివార్లలో ఇటీవల నిర్వహించిన రేవ్‌పార్టీ వ్యవహారం పోలీస్‌ శాఖలోనూ కలకలం రేపుతోంది. రేవ్‌ పార్టీ కొనసాగుతున్నా కనీస సమాచారాన్ని సేకరించలేక పోయారంటూ హెబ్బగూడి పోలీసుఠాణా ఏఎస్‌ఐతో పాటు ముగ్గురిని బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీ మల్లికార్జున బాలదండి సస్పెండ్‌ చేశారు. గూఢచారి విభాగం కానిస్టేబుల్‌ ఎస్‌బీ గిరీశ్, ఏఎస్‌ఐ నారాయణస్వామి, ఆ ప్రాంత గస్తీ కానిస్టేబుల్‌ దేవరాజును సస్పెండ్‌ చేశారు. ఆ ప్రాంత సీఐ, డీఎస్పీలకూ తాఖీదులు జారీ చేశారు. రేవ్‌పార్టీ సమాచారాన్ని స్థానిక పోలీసులు పట్టించుకోలేదని, సీసీబీ విభాగం రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ఎస్పీ నిలదీశారు. అర్ధరాత్రి వేళ సీసీబీ పోలీసులు దాడి చేసిన విషయం మరుసటి రోజు ఉదయం కూడా స్థానిక పోలీసులు గుర్తించలేదని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని