logo

గనుల సంరక్షణకు చర్యలు

ముడి ఇనుము ఉత్పత్తిలో కర్ణాటకలో దేశంలోనే మొదటి స్థానం సాధిస్తుందని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఆశాభావం వ్యక్తం చేశారు.

Published : 04 Dec 2022 01:41 IST

సమావేశంలో ప్రహ్లాద్‌ జోషి, బొమ్మై, హలప్ప ఆచార్‌ తదితరులు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : ముడి ఇనుము ఉత్పత్తిలో కర్ణాటకలో దేశంలోనే మొదటి స్థానం సాధిస్తుందని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఆశాభావం వ్యక్తం చేశారు. బెంగళూరులో ‘గనుల రంగంలో అవకాశాలు- వేలం- పెట్టుబడులు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఆయన శనివారం ప్రారంభించి ప్రసంగించారు. బళ్లారి జిల్లాలో లభించే ముడి ఇనుము ఎంతో విలువైనదని వివరించారు. న్యాయస్థానం సూచనలతో గనుల తవ్వకాలకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ గనుల ప్రగతిలో ప్రస్తుతం ఒడిశా ముందు వరుసలో ఉందన్నారు. ప్రకృతి సంపదను మానవాళి అభివృద్ధికి వినియోగించాలన్నారు. అది దుర్వినియోగం కాకూడదన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దూరదృష్టి కలిగిన నాయకుడని, ప్రకృతి సంపద రక్షణపై ఎక్కువ దృష్టి సారించారని తెలిపారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి మాట్లాడుతూ దేశంలో విద్యుత్తుకు డిమాండ్‌ పెరుగుతోందని, 2040 నాటికి అవసరాలు రెట్టింపు అవుతాయన్నారు. కొరత నివారణకు ఇప్పటి నుంచే ప్రణాళిక అవసరమన్నారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టిసారిస్తే సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. అన్నింటికీ బొగ్గుపై ఆధారపడితే నిల్వలు హరించుకు పోతాయని హెచ్చరించారు. కార్యక్రమంలో మంత్రి హలప్ప ఆచార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని