logo

ముసురు పట్టిన వాతావరణం

తుపాను ప్రభావంతో బెంగళూరు, రామనగర, హాసన, కొడగు, విజయనగర, విజయపుర, బెళగావి, బీదర్‌, ధార్వాడ, గదగ, హావేరి, కొప్పళ, చిత్రదుర్గ, దావణగెరె, మండ్య, మైసూరు, శివమొగ్గ, తుమకూరు, శివమొగ్గ, బళ్లారి, కోలారు, చిక్కబళ్లాపుర జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

Published : 05 Dec 2023 00:41 IST

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : తుపాను ప్రభావంతో బెంగళూరు, రామనగర, హాసన, కొడగు, విజయనగర, విజయపుర, బెళగావి, బీదర్‌, ధార్వాడ, గదగ, హావేరి, కొప్పళ, చిత్రదుర్గ, దావణగెరె, మండ్య, మైసూరు, శివమొగ్గ, తుమకూరు, శివమొగ్గ, బళ్లారి, కోలారు, చిక్కబళ్లాపుర జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై వాన కురిసేలా అనిపించింది. విపరీతమైన చలివాతావరణం ఆవరించింది. కొన్ని చోట్ల జల్లులు కురిశాయి. తుపాను ప్రభావం గురువారం వరకు ఉంటుందని వాతావరణ శాఖ అధికారి ప్రసాద్‌ తెలిపారు. సోమవారం నుంచి గురువారం వరకు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కొన్ని చోట్ల రైతులు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని