logo

సువర్ణకాంతుల సౌధ

బెళగావి సువర్ణ సౌధకు శాశ్వత ప్రాతిపదికన విద్యుత్తు దీపాల వెలుగులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చింది. బెంగళూరులోని విధానసౌధ వద్ద ఆదివారం, సెలవు రోజులు, ప్రత్యేక దినోత్సవాలకు రంగుల వెలుగులు పడేలా ప్రభుత్వం రెండున్నర దశాబ్దాల కిందట చర్యలు తీసుకుంది.

Published : 05 Dec 2023 00:49 IST

బెళగావి, న్యూస్‌టుడే : బెళగావి సువర్ణ సౌధకు శాశ్వత ప్రాతిపదికన విద్యుత్తు దీపాల వెలుగులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చింది. బెంగళూరులోని విధానసౌధ వద్ద ఆదివారం, సెలవు రోజులు, ప్రత్యేక దినోత్సవాలకు రంగుల వెలుగులు పడేలా ప్రభుత్వం రెండున్నర దశాబ్దాల కిందట చర్యలు తీసుకుంది. సువర్ణ సౌధ వద్ద ఇదే తరహా ఏర్పాటు చేయాలని వచ్చిన ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుని ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌ తెలిపారు. శీతాకాల సమావేశాలు, ఆదివారం, సెలవు రోజుల్లో ఈ రంగుల దీపాలను వెలిగించేందుకు ఆదేశాలు ఇచ్చామన్నారు. సందర్శకులు ఇక్కడకు వచ్చి ఫొటోలు తీసుకునేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని