logo

సీఎం, గవర్నర్‌ సంతకాల ఫోర్జరీ

కర్ణాటక పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో సభ్యత్వాన్ని ఇప్పిస్తామని వంచనకు పాల్పడిన నలుగురు నిందితులను బెంగళూరు కేంద్ర నేరనియంత్రణ దళం (సీసీబీ) పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

Published : 03 Apr 2024 02:43 IST

 

బెంగళూరు (మల్లేశ్వరం): కర్ణాటక పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో సభ్యత్వాన్ని ఇప్పిస్తామని వంచనకు పాల్పడిన నలుగురు నిందితులను బెంగళూరు కేంద్ర నేరనియంత్రణ దళం (సీసీబీ) పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి, గవర్నర్‌ పేరిట నకిలీ సంతకాలు చేసి, నియామక పత్రాలను వీరు సృష్టించి రూ.4.10 కోట్ల నగదు వంచనలకు పాల్పడ్డారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. తావరకెరె భువనప్ప లేఅవుట్ నివాసి రిజాయ్‌ అహ్మద్‌ (41), మల్లేశ్వరం నివాసి యూసుఫ్‌ సుద్ధికట్టె (47), మూడిగెరె నివాసి సి.చంద్రప్ప (44) కనకపుర తాలూకా ఉయ్యంబళ్లి నివాసి రుద్రేశ్‌ (35)ను నిందితులుగా గుర్తించారు. చేతన్‌ శంకర్‌, హర్షవర్ధన్‌, మహేశ్‌ అనే సహచరులతో కలిసి వీరు వంచనలకు పాల్పడ్డారు. కొందరు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దాడులు నిర్వహించి వీరిని అరెస్టు చేశామని నగర పోలీసు కమిషనర్‌ బి.దయానంద్‌ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు తీవ్రం చేశామన్నారు.


ఎన్నికల అధికారి ఆత్మహత్యాయత్నం

మంగళూరు: ఎన్నికల విధుల్లో ఉన్న శ్రీధర్‌ హెగ్డే అనే అధికారి దక్షిణ కన్నడ జిల్లాధికారి కార్యాలయం ఆవరణలో బలవన్మరణానికి ప్రయత్నించారు. వ్యక్తిగత కారణాలతో ఆయన విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారని గుర్తించారు. బాధితుడ్ని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఆయన భార్య జయంతి స్టాఫ్‌ నర్సు. నగర ఠాణా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని