logo

నా విజయంలో తెదేపా పాత్ర కీలకం: వైరా ఎమ్మెల్యే రాందాస్‌

తన విజయంలో తెదేపా పాత్ర మరువలేనిదని వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్‌ అన్నారు. వైరాలోని తెదేపా కార్యాలయానికి ఎమ్మెల్యే రాందాస్‌నాయక్‌ తన అనుచరులతో కలిసి మంగళవారం వెళ్లారు.

Updated : 13 Dec 2023 10:53 IST

ఎమ్మెల్యే రాందాస్‌నాయక్‌ను సత్కరిస్తున్న చెరుకూరి చలపతిరావు, బొర్రా రాజశేఖర్‌, సూతకాని జైపాల్‌

వైరా, న్యూస్‌టుడే: తన విజయంలో తెదేపా పాత్ర మరువలేనిదని వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్‌ అన్నారు. వైరాలోని తెదేపా కార్యాలయానికి ఎమ్మెల్యే రాందాస్‌నాయక్‌ తన అనుచరులతో కలిసి మంగళవారం వెళ్లారు. తెదేపా నియోజకవర్గ అధ్యక్షుడు చెరుకూరి చలపతిరావు, మండల అధ్యక్షుడు కిలారు సురేందర్‌తోపాటు పలువురికి కృతజ్ఞతలు తెలిపారు. 

ఎన్నికల సమయంలో నియోజకవర్గ స్థాయిలో తెదేపా ఎంతో అండగా నిలిచిందన్నారు.  భారాసను ఓడించాలన్న కాంగ్రెస్‌ శ్రేణుల సంకల్పానికి తెదేపా ఎంతగానో దోహదపడిందని పేర్కొన్నారు. అన్ని మండలాల్లోనూ పార్టీ శ్రేణులు తనకు మద్దతు తెలపడంతోపాటు విజయానికి క్షేత్రస్థాయిలోనూ పనిచేయడం తన అదృష్టమన్నారు. అపూర్వమైన మెజార్టీ అందించేలా కృషి చేశారని, రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి అండగా ఉండటమే కాకుండా నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయిలో ఉండేలా అభివృద్ధి చేస్తానని చెప్పారు.

రాజకీయాలకు అతీతంగా అందరివాడిగా గుర్తింపు తెచ్చుకుంటానన్నారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్‌ మాజీ ఉపాధ్యక్షుడు బొర్రా రాజశేఖర్‌, పురపాలిక ఛైర్మన్‌ సూతకాని జైపాల్‌, సొసైటీ మాజీ అధ్యక్షుడు మందడపు మధుసూదన్‌రావు, కాంగ్రెస్‌ మండల, పట్టణ   అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, ఏదునూరి సీతరాములు, తెదేపా పట్టణ అధ్యక్షుడు   మన్నేపల్లి ప్రదీప్‌, దార్నా     రాజశేఖర్‌, మచ్చా బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని