logo

భారాసకు మూకుమ్మడి రాజీనామా..!

భద్రాచలం పట్టణానికి చెందిన పలువురు నాయకులు భారాసకు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ దుమ్ముగూడెం మండలంలో శుక్రవారం నిర్వహించిన సమావేశానికి సంబంధించిన సమాచారం చేరవేయలేదంటూ గులాబీ పార్టీని వీడారు.

Updated : 13 Apr 2024 05:46 IST

రాజీనామా చేసిన నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

భద్రాచలం పట్టణం, న్యూస్‌టుడే: భద్రాచలం పట్టణానికి చెందిన పలువురు నాయకులు భారాసకు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ దుమ్ముగూడెం మండలంలో శుక్రవారం నిర్వహించిన సమావేశానికి సంబంధించిన సమాచారం చేరవేయలేదంటూ గులాబీ పార్టీని వీడారు. అంతకుముందు భద్రాచలంలోని ఓ ఫంక్షన్‌ హాలులో భారాస పట్టణ ప్రధాన కార్యదర్శి కె.కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నాయకులు భేటీ అయ్యారు. పార్టీ అనుబంధ సంఘాలు, బూత్‌ కమిటీల సభ్యులు పలువురు పార్టీకి రాజీనామా చేశారు. సొంత పార్టీ నేతలే తమను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడి    పనిచేసే కార్యకర్తలకు సమాచారం ఇవ్వకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. రాజీనామా   అనంతరం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును కలిశారు.  రాజీనామా చేసిన కార్యకర్తలు, నాయకులు అధైర్యపడొద్దని, త్వరలోనే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు రమాకాంత్‌, చిట్టిబాబు, రాజీవ్‌, రజనీకాంత్‌, శ్రీనివాస్‌, విజయ్‌, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని