logo

ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

మండల పరిధిలోని గాండ్లబయ్యారంలో  సీతా సమేత రామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు.

Published : 13 Apr 2024 11:15 IST

పినపాక: మండల పరిధిలోని గాండ్లబయ్యారంలో  సీతా సమేత రామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. గతంలో  ఆలయం శిథిలావస్థకు చేరడంతో ఆలయ కమిటీ సభ్యులు పునర్నిర్మాణం చేపట్టారు.  దాతల సహకారంతో నూతన ఆలయాన్ని నిర్మించారు. మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు చేసి సీతారాములు, ఆంజనేయస్వామి, వినాయక స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు.  అనంతరం సుమారు 3వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయకమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని