logo

రూ. లక్ష విలువైన కలప స్వాధీనం

అటవీశాఖ అధికారులు, సిబ్బంది నిత్యం అడవుల సంరక్షణకు కృషి చేస్తున్నా కలప దొంగల అక్రమాలు ఆగడం లేదు.

Updated : 21 Apr 2024 18:25 IST

ఇల్లందు గ్రామీణం: అటవీశాఖ అధికారులు, సిబ్బంది నిత్యం అడవుల సంరక్షణకు కృషి చేస్తున్నా కలప దొంగల అక్రమాలు ఆగడం లేదు. ఇటీవల రోల్లపాడులో భారీఎత్తున నార వేప పట్టుకున్న అటవీశాఖ అధికారులు తాజాగా ఇల్లందు పట్టణ శివారు  పొలాల్లో  టేకు దుంగలను నిల్వ చేశారన్న సమాచారంతో దాడులు చేశారు. ఎఫ్‌డీవో వెంకన్న ఆధ్వర్యంలో చెట్ల మాటున దాచిన రూ. లక్ష విలువైన టేకు దుంగలను పట్టుకున్నారు. వీటిని తరలించేందుకు సిద్ధంగా ఉంచినట్టు గుర్తించారు. కాగా పట్టుకున్న కలపను ఇల్లందు అటవీశాఖ కలప డిపోనకు తరలించి విచారణ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని