logo

రామయ్యకు వైభవంగా ఊంజల్‌ ఉత్సవం

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది.

Published : 22 Apr 2024 01:38 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. భజనలు కీర్తనలతో కోవెల పరిసరాలు రామ నామాలతో మార్మోగి అంతా రామమయమైంది. సుప్రభాతం పలికి నామార్చన చేసిన అర్చకులు ప్రధాన ఆలయంలో కొలువైన మూలమూర్తులను ఆరాధించారు. భక్తిశ్రద్ధలతో సాగిన వేద పారాయణం పరవశింపచేసింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా రాత్రి వేళ ఊంజల్‌ సేవను వైభవంగా కొనసాగించారు. బేడా మండపం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊయలలో స్వామివారిని ఉంచి పూజలు చేశారు. కల్యాణం అనంతరం నిర్వహించే సంబరాలలో ఇది అతి ముఖ్యమైన ఉత్సవమని పండితులు పేర్కొన్నారు. సోమవారం వసంతోత్సవం ఉంటుందని ఈవో రమాదేవి తెలిపారు.

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: పర్ణశాల రామాలయంలో శ్రీ సీతారాముల ఉత్సవమూర్తుల ఊంజల్‌ ఉత్సవాన్ని రామాలయంలో ఆలయ అర్చకులు ఆదివారం ఏకాంతంగా నిర్వహించారు. సాయంత్రం నుంచి వర్షం ప్రారంభం కావడంతో ఊంజల్‌ ఉత్సవానికి కొంత ఆటంకం కలిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని