logo

ఈదురుగాలులతో వర్షం.. కాసింత ఉపశమనం

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసింది.

Published : 22 Apr 2024 01:42 IST

కారేపల్లిలో కురుస్తున్న వాన

ఈటీవీ, ఖమ్మం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసింది. వేసవి తాపం, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించింది. ఈదురుగాలులకు కొన్నిచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. పిడుగులు పడ్డాయి. విద్యుత్తు సరఫరాకు కాసేపు అంతరాయం ఏర్పడింది. అక్కడక్కడ పంటలకు నష్టం వాటిల్లింది. కల్లాల్లోని ధాన్యం, మిర్చి తడిసింది. భద్రాద్రి జిల్లాలోని   అశ్వారావుపేట, కొత్తగూడెం, ఇల్లెందు, చంద్రుగొండ, చర్ల, జూలూరుపాడు, పాల్వంచ, గుండాల, ఆళ్లపల్లి, అన్నపురెడ్డిపల్లి, ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, కూసుమంచి, తిరుమలాయపాలెం, కామేపల్లి, కారేపల్లి మండలాల్లో వర్షం కురిసింది.

అశ్వారావుపేట గ్రామీణం: కొత్తూరు శివారులో రోడ్డుపై పడిన భారీ వృక్షం

ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌టుడే: జిల్లాలో ఆదివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆదివారం రాత్రి 8 గంటల వరకు జిల్లాలోని ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్లలో నమోదైన వర్షపాతం ప్రకారం.. సింగరేణి మండలంలో అత్యధికంగా 39.0 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

కొత్తగూడెం బస్టాండ్‌ ప్రాంతంలో కారుపై  విరిగిపడిన చెట్టుకొమ్మ

ఆయా మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు (మిల్లీ మీటర్లలో..)..

సింగరేణి: 39.0, కామేపల్లి: 15.3, ఖమ్మం గ్రామీణం: 13.5, కూసుమంచి: 3.8, ఖమ్మం అర్బన్‌: 2.0, ఏన్కూరు: 1.7, ముదిగొండ: 1.1, రఘునాథపాలెం: 1.0, మధిర: 0.5, తిరుమలాయపాలెం: 0.5.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని