logo

‘అమ్మ’ ఆదర్శ పాఠశాలల పనులపై కలెక్టర్‌ సమీక్ష

‘అమ్మ’ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనుల పూర్తి బాధ్యత హెచ్‌ఎంలదే అని కలెక్టర్‌ ప్రియాంక అల అన్నారు. కలెక్టరేట్‌ నుంచి హెచ్‌ఎంలతో వీడియోకాన్ఫరెన్స్‌లో మంగళవారం మాట్లాడారు.

Published : 24 Apr 2024 06:10 IST

కొత్తగూడెం కలెక్టరేట్: ‘అమ్మ’ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనుల పూర్తి బాధ్యత హెచ్‌ఎంలదే అని కలెక్టర్‌ ప్రియాంక అల అన్నారు. కలెక్టరేట్‌ నుంచి హెచ్‌ఎంలతో వీడియోకాన్ఫరెన్స్‌లో మంగళవారం మాట్లాడారు. 643 పాఠశాలల్లో పనులను మే 30 నాటికి పూర్తిచేయాలన్నారు. పోలింగ్‌ కేంద్రాలున్న చోట పనులను వారం రోజుల్లో ముగించాలని ఆదేశించారు. డీర్డీఓ విద్యా చందన, డీఈఓ వెంకటేశ్వరాచారి, సెక్టోరియల్‌  అధికారులు సతీశ్‌కుమార్‌, సైదులు పాల్గొన్నారు.  

పినపాక, మణుగూరు పట్టణం: అమ్మ ఆదర్శ పాఠశాల పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్‌ ప్రియాంక అల ఆదేశించారు. పినపాక మండలం పాండురంగాపురం, జానంపేట పాఠశాలల్లో  పనులను  పరిశీలించారు. పాండురంగాపురంలో ఆఫీస్‌ రూమ్‌ను పోలింగ్‌ కేంద్రానికి కేటాయించడంపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం సుందరయ్యనగర్‌లో స్థానికులతో మాట్లాడారు. తహసీల్దార్‌ సూర్యనారాయణ, ఎంపీడీవో రామకృష్ణ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ తిరుమలేశ్‌, పీఆర్‌ ఏఈ రెహనార్డ్‌ తదితరులు పాల్గొన్నారు. మణుగూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో భద్రపరిచిన పోలింగ్‌ సామగ్రి స్ట్రాంగ్‌ రూంని కలెక్టర్‌ పరిశీలించారు. తహసీల్దార్‌ రాఘవరెడ్డి, డీఎస్పీ రవీందర్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని