logo

పడిపోతున్న ఎండు మిరప ధరలు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఎండు మిరప ధరలు పడిపోతున్నాయి. రోజురోజుకు ధరలు తగ్గటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Published : 24 Apr 2024 06:16 IST

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఎండు మిరప నిల్వలు

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఎండు మిరప ధరలు పడిపోతున్నాయి. రోజురోజుకు ధరలు తగ్గటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విపణిలో మంగళవారం క్వింటా ఎండు మిరప గరిష్ఠ ధర రూ.18,700 పలికింది. నాలుగు రోజుల కిందట క్వింటా గరిష్ఠ ధర రూ.20,000 ఉండగా ఇప్పుడు మరింత తగ్గింది. గరిష్ఠ ధరల పరిస్థితి ఇలా ఉండగా వ్యాపారులు మాత్రం ఇంతకన్నా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఇప్పుడు మిరప రైతులకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. మార్కెట్‌కు ఎండు మిరప నిల్వలు 14 వేల బస్తాలు రాగా తాలు మిరప 3 వేల బస్తాలు వచ్చింది. తాలు మిరప క్వింటా గరిష్ఠ ధర రూ.9,800 చొప్పున కొనుగోలు చేశారు. పలు ప్రాంతాల నుంచి సరకు తెచ్చిన రైతులు గత్యంతరం లేక విపణిలో తక్కువ ధరకే విక్రయిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని