logo

బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలలకు దరఖాస్తు చేసుకోండి

బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్‌ జైన్‌ సోమవారం ఓ ప్రకటనలో సూచించారు.

Published : 21 May 2024 02:36 IST

భద్రాచలం పట్టణం, న్యూస్‌టుడే: బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్‌ జైన్‌ సోమవారం ఓ ప్రకటనలో సూచించారు. 2024-25 విద్యా సంవతరానికిగాను 3, 5, 8 తరగతుల్లో ప్రవేశాలకు దమ్మపేట, ఇల్లెందులో గిరిజన సంక్షేమ శాఖ, భద్రాచలం డీడీ వెల్ఫేర్‌ కార్యాలయాల్లో దరఖాస్తులు పొందవచ్చన్నారు. జూన్‌ 12న ఐటీడీఏ భద్రాచలం కార్యాలయంలో లాటరీ ద్వారా విద్యార్థుల ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న గిరిజన విద్యార్థినీ విద్యార్థులు గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని పీఓ సూచించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు