logo

ఎర్ర చీమల గుడ్లూ.. ఆదివాసీల ఆహారమే..!

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో ఆదివాసీలు ఏప్రిల్‌ మాసం చివరిలో ఎర్ర చీమల గుడ్లతో కూర, పచ్చడి తయారు చేసుకుని తింటుంటారు.

Published : 21 May 2024 02:40 IST

చర్ల, న్యూస్‌టుడే: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో ఆదివాసీలు ఏప్రిల్‌ మాసం చివరిలో ఎర్ర చీమల గుడ్లతో కూర, పచ్చడి తయారు చేసుకుని తింటుంటారు. ఇందులో భాగంగా వనంలో చెట్ల మీద ఎర్రచీమలు పెట్టే గుడ్లను, చిన్న చీమలను సమీకరిస్తారు. వాటిని రావి చెట్టు చిగురుతో కలిపి వండుకుంటామని వివరిస్తున్నారు. చర్ల మండలంలోని మారుమూల చెన్నాపురానికి చెందిన గొత్తికోయలు ఎర్ర చీమల గుడ్లను సేకరించి ఇంటికి తేవడాన్ని శనివారం ‘న్యూస్‌టుడే’ తన ఛాయాగ్రాహకంలో బంధించింది. ఏటా ఏప్రిల్‌ చివరి మాసం నుంచి మే నెలాఖరు వరకు ఎర్రచీమల గుడ్లను సేకరిస్తారు. వాటితోనే పచ్చడి, కూరను చేసుకొని తింటుంటారు. ఈ ఎర్ర చీమల గుడ్లను ఛత్తీస్‌గఢ్‌లో వారపు సంతల్లోనూ ఆదివాసీలు విక్రయిస్తుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని