logo

ఆదివాసీ సంప్రదాయం ‘చల్ల’గుండాలి

వేసవి వచ్చిందంటే ఆదివాసీల వద్ద ఆనప(సొరకాయ) బుర్ర ఉండాల్సిందే. ఇది వారికి కదిలే ఫ్రిజ్‌. గిరిజన ఆచార వ్యవహారాలపై మక్కువ ఉన్న భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్‌జైన్‌ కొద్ది రోజుల నుంచి ఆనప బుర్రను ఉపయోగించి అందులో నీటినే తాగుతున్నారు.

Updated : 21 May 2024 05:20 IST

భద్రాచలం, న్యూస్‌టుడే : వేసవి వచ్చిందంటే ఆదివాసీల వద్ద ఆనప(సొరకాయ) బుర్ర ఉండాల్సిందే. ఇది వారికి కదిలే ఫ్రిజ్‌. గిరిజన ఆచార వ్యవహారాలపై మక్కువ ఉన్న భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్‌జైన్‌ కొద్ది రోజుల నుంచి ఆనప బుర్రను ఉపయోగించి అందులో నీటినే తాగుతున్నారు. పర్యటనలకు ఎటువెళ్లినా తన వాహనంలో దీనికి చోటు కల్పిస్తున్నారు. కార్యాలయంలో ఉన్నప్పుడూ ఇందులో నీటినే తాగుతున్నారు. సాధారణంగా ఉన్నతాధికారులు ఖరీదైన నీటి సీసాలను ఉపయోగిస్తుంటారు. ఆయన మాత్రం ఆనప బుర్రను ఉపయోగిస్తూ గిరిజన సంప్రదాయాలను గౌరవిస్తుండటం విశేషం. విస్తరాకుల తీగ తప్సి నారతో అల్లిన ఆనప బుర్రలను ఆదివాసీలు ఇటీవల పీఓకు అందించినట్లు గిరిజన మ్యూజియం ఇంఛార్జి వీరాస్వామి తెలిపారు. చల్లదనంతోపాటు ఔషధ గుణాలు కలిగి ఉంటుందని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని