logo

పట్టభద్రుల సమస్యలపై నిలదీసేందుకు భాజపాకు మద్దతివ్వాలి: ఈటల

ఉద్యోగులు, పట్టభద్రుల సమస్యలపై చట్టసభల్లో నిలదీసేందుకు భాజపా అభ్యర్థికి మద్దతు తెలపాలని ఆపార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్‌ కోరారు.

Published : 21 May 2024 02:47 IST

ఖమ్మం అర్బన్, న్యూస్‌టుడే: ఉద్యోగులు, పట్టభద్రుల సమస్యలపై చట్టసభల్లో నిలదీసేందుకు భాజపా అభ్యర్థికి మద్దతు తెలపాలని ఆపార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్‌ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అతి తక్కువ కాలంలో ప్రజలతో ఛీకొట్టించుకుంటోందన్నారు. భాజపా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం నగరంలో ఆయన సోమవారం పర్యటించారు. శ్రీశ్రీ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈటల మాట్లాడారు.  శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలనే నెరవేర్చలేకపోతున్నారని, దేశంలో మహిళలకు     రూ.8,500 ఎలా ఇస్తారని కాంగ్రెస్‌ నాయకులను ప్రశ్నించారు. మోసపూరిత, అమలుకు సాధ్యం కాని హామీలిస్తూ ప్రజలను మోసగించటంలో  హస్తం పార్టీ నాయకులు నిష్ణాతులు అని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ యువత, ఉద్యోగుల సమస్యలపై చట్టసభల్లో కొట్లాడాలంటే ప్రలోభాలను పక్కకు పెట్టి భాజపా అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో భాజపా ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, తాండ్ర వినోద్‌రావు, కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, దేవకి వాసుదేవరావు, మాజీ ఎంపీ వీబీ పాటిల్, దొంగల సత్యనారాయణ, శీలం పాపారావు, ఉప్పల శారద, నంబూరి రామలింగేశ్వరరావు, గెంటేల విద్యాసాగర్‌రావు, గంగారెడ్డి, రుక్మారావు తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని