logo

అర్హులందరికీ రేషన్‌ కార్డులు: పొంగులేటి

రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్‌ కార్డులు, పక్కా ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సంక్షేమ పథకాల అమలు, ఆరు గ్యారంటీల విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు.

Published : 21 May 2024 02:51 IST

నేలకొండపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్‌ కార్డులు, పక్కా ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సంక్షేమ పథకాల అమలు, ఆరు గ్యారంటీల విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. గువ్వలగూడెం, ముజ్జుగూడెం, అనాసాగరం, సదాశివపురం, పాత కొత్తూరు, నాచేపల్లిలో సోమవారం పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగియగానే పనులన్నీ పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో నీటి ఎద్దడి నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడతామన్నారు. మూడేళ్లలో పాలేరు నియోజకవర్గంలో పేదలందరికీ ఇందిరమ్మ పక్కా గృహాలుండాలన్నదే తన లక్ష్యమన్నారు. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, శాఖమూరి రమేశ్, నెల్లూరి భద్రయ్య, చెరువు స్వర్ణ, బచ్చలకూరి నాగరాజు, కడియాల నరేశ్‌ పాల్గొన్నారు. 

ఖమ్మం కమాన్‌బజార్‌: డీసీసీ మాజీ అధ్యక్షుడు బానోతు సోమ్లానాయక్‌ అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం పరామర్శించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని