logo

పాతాళానికి పరుగులు

గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు,  ఇటీవల మండే ఎండలకు జిల్లాలో భూగర్భ జలం పాతాళానికి పరుగులు తీస్తోంది.  చెరువులు, కుంటల్లో నీటి జాడ లేక పూర్తిగా ఎండిపోవడంతో జిల్లావ్యాప్తంగా భూగర్భ జలమట్టం పడిపోయింది.

Updated : 21 May 2024 05:20 IST

పడిపోతున్న భూగర్భ జలమట్టం
ఖమ్మం నగరం, న్యూస్‌టుడే

తేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు,  ఇటీవల మండే ఎండలకు జిల్లాలో భూగర్భ జలం పాతాళానికి పరుగులు తీస్తోంది.  చెరువులు, కుంటల్లో నీటి జాడ లేక పూర్తిగా ఎండిపోవడంతో జిల్లావ్యాప్తంగా భూగర్భ జలమట్టం పడిపోయింది. గతేడాది ఏప్రిల్‌లో జిల్లాలో సరాసరి 5.68 మీటర్ల లోతులో నీరుంటే ఈ ఏడాది ఏప్రిల్‌లో 7.56 మీటర్ల లోతుకు పడిపోయింది. అంటే 1.88 మీటర్ల కిందికి వెళ్లింది. గత మార్చిలో 6.86 మీటర్ల లోతులో నీరు అందుబాటులో ఉండగా గత ఏప్రిల్‌లో 7.56 మీటర్లకు తగ్గింది. అంటే నెల రోజుల్లో 0.70 మీటర్ల లోతుకు నీరు పడిపోయింది. జిల్లావ్యాప్తంగా 66 నీటి వనరుల్లో ఫీజో మీటర్లు అమర్చి ప్రతినెలా భూగర్భ జలమట్టం లెక్కిస్తుంటారు. కమాండ్‌ ఏరియాలో 39, నాన్‌ కమాండ్‌ ఏరియాలో 27 ఫీజో మీటర్లు అమర్చారు. భూగర్భ జలమట్టం పడిపోతున్నా 58 ఫీజో మీటర్ల పరిధిలో పరిస్థితి సేఫ్‌ జోన్‌లో ఉండగా, నాలుగు ఫీజో మీటర్ల    పరిధిలో సెమీ క్రిటికల్, మరో నాలుగు ఫీజో మీటర్ల పరిధిలో క్రిటికల్‌గా ఉన్నట్లు భూగర్భ జల శాఖ అధికారులు తమ నెలవారీ నివేదికలో ప్రస్తావించారు. మే నెలలో మరింత లోతుకు భూగర్భ జలాలు దిగిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని