logo

రామాలయం భూముల రక్షణపై సమీక్ష

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి ఉన్న భూముల వివరాలపై హైదరాబాద్‌లో మంగళవారం దేవాదాయ శాఖామంత్రి కొండా సురేఖ, ఆశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్‌ హనుమంతరావు సమీక్షించారు.

Published : 22 May 2024 03:59 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి ఉన్న భూముల వివరాలపై హైదరాబాద్‌లో మంగళవారం దేవాదాయ శాఖామంత్రి కొండా సురేఖ, ఆశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్‌ హనుమంతరావు సమీక్షించారు. క్షేత్ర స్థాయి పరిస్థితులను ఈఓ రమాదేవిని అడిగి తెలుసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 1,300 ఎకరాల భూమి రామాలయానికి ఉండగా.. ఇందులో ఎక్కువ భాగం ఆక్రమణలో ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామంలో దేవుడి భూముల పరిస్థితిపై చర్చించారు. అక్కడి ఆక్రమణలను చట్టపరంగా తొలగించాలని నిర్ణయించారు. దేవుడి పేరిట ఉన్న ప్రతి అంగుళం జాగాను కంప్యూటరీకరించే అంశంపై సమీక్షించారు. ఆలయంలో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రగతితోపాటు, చేయాల్సిన వాటిపైనా చర్చలు సాగాయి. మాస్టర్‌ ప్లాన్‌పై మరో దఫా సమీక్ష నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని